ఓబులేష్ రచనలు

ఓబులేష్  రచనలు
ఓబులేష్ రచనలు

Sunday, 31 May 2015

వాత్స్యాయన కామశాస్త్రం Part 7 సంభోగంలో స్త్రీకి భావప్రాప్తి

తిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 7రతి క్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడే పురుషునికి ఆనందం కలుగుతుంది. వీర్య స్కలనంతో పురుషుడు తృప్తి చెందుతాడు.
ఆ సమయానికి స్త్రీకి భావప్రాప్తి కలగకపోతే ఆమె బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.రతిక్రీడలో స్త్రీకి భావప్రాప్తి కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఆమె హావ భావాలే ఆధారం. సంభోగంలో స్త్రీకి భావప్రాప్తి కలిగినప్పుడు

అప్పటి వరకు బిగింపులో వున్న ఆమె శరీరం సడలిపోతుంది.
కనులు మూతపడతాయి.
ఆమెలో అప్పటివరకు ఉన్న సిగ్గుతెరలు తొలగిపోతాయి.
మరింతగా రతిని కోరుకుంటూ పురుషుని అల్లుకుపోతుంది.
భావప్రాప్తి సమయంలో స్త్రీ తన చేతులు తీవ్రంగా విదిలిస్తుంది.
శరీరమంతా చమటలు పడాతాయి.
పురుషునిపై దంత క్షతాలు చేస్తుంది.
పురుషుడు తనపై నుంచి లేవకుండా గట్టిగా హత్తుకుంటూ అల్లుకుపోతుంది.
ముద్దుల వర్షం కురిపిస్తుంది.
తన కాళ్లతో అతడి కాళ్లను తీగలా అల్లేస్తుంది.
తన పాదాలతో నొక్కుతుంది.
పురుషుని కన్నా ముందు తనకు సుఖం కలిగితే పురుషుని కిందకు పడదోసి అతనిపై పడి పురుషునిలా ప్రవర్తిస్తుంది.

స్త్రీకి కలిగే భావప్రాప్తి లక్షణాలివి.
------------------------------------------------
సాధారణంగా ఉద్రేకపడిపోయే పురుషునికే స్త్రీకన్నా ముందుగా సుఖ ప్రాప్తి కలిగి వీర్య స్కలనం కలుగుతుంది. అందువల్ల పురుషుడు ముందుగా స్త్రీని రతిక్రీడకు ఉద్యుక్తురాలిని చేయాలి. పురుషుడు తనకు కోరిక కలిగిన వెంటనే రతికి ఉపక్రమించకుండా ముందుగా స్త్రీని ఆలింగన, చుంబన, దంత నఖ క్షతాదులతో రెచ్చగొట్టాలి. అప్పుడామె రతి క్రీడకు మానసికంగా, శారీరకంగా సన్నద్ధం అవుతుంది.
సంభోగ క్రియ గురించి వాత్స్యాయనుడు అరవై నాలుగు ప్రకరణాలలో వివరించారు. దీనిని చతుష్షష్టి అని కూడా అంటారు. నిజానికి కళలను కూడా 64 రకాలని విభజించారు. ఆ కళల సమూహమే చతుష్షష్టి అని కూడా కొందరంటారు. ప్రస్తుతం వాత్స్యాయనుడు వివరించిన చతుష్షష్టి స్వరూపాన్ని, అందలి అంశాలనూ తెలుసుకుందాం.
1. ఆలింగనం,
2. చుంబనం,
3. దంత క్షతం,
4. నఖక్షతం,
5. సీత్కారం,
6. పాణిఘాతం,
7. సందశనం,
8. ఉపనృతం,
9. ఉపనృప్తం,
10. వరాయితం అని పది అంగాలున్నాయి.
ఇవి రుగ్వేదంలో పది రుక్కులున్నాయి.

దీనిలో ఆలింగనం అంటే కౌగిలించుకోవడం.
చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం.
నఖక్షతం అంటే గోళ్లతో గిచ్చడం లేదా రక్కడం.
దంత క్షతం అంటే పళ్లతో గిచ్చడం.
సంవేశనం అంటే తత్తరపాటుతో పడుకోవడం.
సీత్కృతం అంటే చలిగా వున్నప్పుడు వణికినట్లుగా రతి సమయంలో రకరకాల ధ్వనులు చేయడం.
ఔపరిష్టం అంటే నోట్లో నోరు పెట్టి చుంబించడం అని వాత్స్యాయనుడు వివరించారు.

ఆలింగనాది క్రియలలో అనేక రకాలున్నాయి. అసలు ఆలింగనానికి ప్రేరణ ఏమిటి ఇత్యాది విషయాలను వాత్స్యాయనుడు ఈ విధంగా వివరిస్తున్నారు.

ప్రేమికులు మొదట చేయవలసిన పని ముద్దు పెట్టుకోవడం కాదు.
మొదట కౌగిలించుకోవాలి. ఆ తర్వాత ముద్దు పెట్టుకోవాలి.పరస్పర అనురాగ పూరితులైన ప్రేమికులకు మొదట ఒకరినొకరు కౌగిలించుకోవాలనే కోరిక కలుగుతుంది తమ ప్రేమను సూచిచుకోవడానికి, ఒకరి సాన్నిహిత్యాన్ని ఎంతగా తాము కోరుకుంటున్నదీ తెలపడానికీ వారు కౌగిలింతలను మార్గంగా చేసుకుంటారు.

కౌగిలింతలు నాలుగు (4)రకాలు:-
1. స్పృష్టకం - అంటే ఒకరి నొకరు స్పృశించడం.
2. విద్ధకం - ఒకరినొకరు గట్టిగా నొక్కుకోవడం.
3. ఉద్ఘృష్టం- ఒకరినొకరు గట్టిగా రాచుకోవడం.
4. పీడితకం - గాఢంగా ఒత్తుకోవడం.

యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలివి.
---------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------

పరుండిన భంగిమలోని కౌగిలింతలేమిటో చూద్దాం :: వాత్స్యాయన కామశాస్త్రం Part 81. స్త్రీ పురుషులు ఒకరి తొడతో మరొకరి తొడను చుట్టేసి, చేతులతో పెనవేసుకుని శయనించే భంగిమను తిల తండులకం అని అంటారు.

2. మోహ పరవశులై విపరీతమైన అనురాగంతో బలంగా కౌగిలించుకోవడాన్ని క్షీర జలకం అని అంటారు.
కూర్చున్న లేదా పరుండిన భంగిమలలో ఏ స్థితిలోనైనా ఈ కౌగిలింతలో సుఖం అనుభవించవచ్చునని వాత్స్యాయనుడు అంటారు. ఈ భంగిమలో స్త్రీ పురుషులు పాలు, నీరు కలిసినట్టు కలిసిపోతారు. అందుకే దీనిని క్షీర జలకం అని అంటారు.

3. క్షీర జలకం భంగిమలోనే పురుషుడు తన తొడలతో స్త్రీ ఒక తొడను కాని, రెండు తొడలను కాని చుట్టివేసి స్త్రీ తొడలను బలంగా ఒత్తితే దానినిఊరూప గుహనం అని అంటారు.

4. పురుషుడు కూర్చున్నా,నిలుచున్నా లేదా శయనించి ఉన్న సమయాలలో స్త్రీ పురుషుని వక్ష స్థలంపై తన వక్షోజాల భారం మోపి అతనిలో కామోద్రేకం రేపుతూ చేతులతో మాత్రం కౌగిలించుకోని స్థితిని స్థనాలింగనం అని అంటారు.
అంటే స్త్రీ తన స్థనాలతో పురుషుని కౌగిలించుకోవడం అన్న మాట. ఈ భంగిమ పురుషునిలో తీవ్రమైన మోహావేశాన్ని కలిగిస్తుంది. ఎంతటి జడునిలోనైనా చలనాన్ని కలిగించి తీరుతుంది.

5. స్త్రీ పురుషులు గాఢంగా కౌగిలించుకున్న స్థితిలో ఒకరి మొహంలో ఒకరు మొహం పెట్టి, ఒకరి కన్నులలో మరొకరు చూసుకుంటూ, ఒకరి ఫాల భాగం మరొకరి ఫాల భాగం తాకుతూ ఉండే స్థితిని లలాటికం అని అంటారు.

సాధారణంగా శృంగార క్రీడ ముగిసిన తర్వాత ఇటువంటి భంగిమలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

ఇవే కాకుండా స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలను బట్టి ఎన్నో రకాల ఆలింగనాలు జరగవచ్చు. ఏ కౌగిలింత అయినా స్త్రీ పురుషులను శృంగార క్రీడకు దోహదం కలిగించేవిగా ఉండాలి.

ఏదేమైనా స్త్రీ శరీర తత్వాన్ని గ్రహించి పురుషుడు రతి సాగించాలి. అప్పుడే ఇద్దరికీ సుఖం కలుగుతుంది.
సాధారణ స్త్రీ శరీర తత్వం మెల్లగా పారే సెలయేరు వంటిదని, పురుషుని తీరు ఎగసి పడే సముద్రం వంటిదని వాత్స్యాయనుడు వివరిస్తాడు. స్త్రీలో వాంఛ నెమ్మదిగా కలిగి రసోద్రేకం కలగడానికి కొంత సమయం పడుతుంది. పురుషుని స్థితి ఆ విధంగా ఉండదు. స్త్రీ తత్వాన్ని పురుషుడు గ్రహించి, ఆమెకు అనుకూలంగా మసలాలి.

స్త్రీలో స్పర్శ, కౌగిలింతలు, చుంబనాలు ఆమెలోని కోర్కెను ద్విగుణీకృతం చేస్తాయి, అయితే పురుషునికి సంభోగంతోనే తృప్తి కలిగి శృంగార క్రియ ముగిసినట్టవుతుంది.
పురుషుని తీరును బట్టి స్త్రీ సంభోగ క్రియలో ఒకేసారి కాకుండా ఎక్కువ సార్లు కూడా భావ ప్రాప్త్రి పొందగలుగుతుంది.
పురుషుడు రతి ముగించినప్పుడు ఆమెలో కామోద్రేకం తగ్గుముఖం పడుతుంది. ఇది గ్రహిస్తే స్త్రీని శృంగారంలో ఎక్కువగా తృప్తి పరచవచ్చని వాత్స్యాయనుడు అంటారు.

స్త్రీని బాహ్య ప్రేరణలతోనే పరవశురాలిని చేయవచ్చు. బాహ్య ప్రేరణలోని కౌగిలింతల గురించి తెలుసుకున్నారు కదా.
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------

శృంగారానికి స్త్రీని సన్నధం చేయడం ఎలా :: వాత్స్యాయన కామశాస్త్రం Part 9శృంగార క్రీడకు కౌగిలింత తొలిమెట్టయితే, చుంబనం రెండవ మెట్టులాంటిదని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే ముందుగా స్త్రీని కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమెని గాఢంగా హత్తుకుంటూ ముద్దు పెట్టుకోవాలి. అయితే దీనికి ఒక చిన్న మినహాయింపు వంటిది కూడా శాస్త్రకారులిచ్చారు.అదేమిటంటే ఎక్కువసేపు సంభోగం జరపగల పురుషుడు స్త్రీని ముందు ముద్దులతో ముంచెత్తి ఆ తర్వాత ఆమెను కౌగిలించుకోవాలని పేర్కొన్నాడు.నిజానికి శృంగార క్రీడలో చుంబనానికి సంబంధించి అయిదు విభాగాలున్నాయని (చుంబన పంచకo ) వాత్స్యాయనుడు వివరించాడు.
అవేమిటంటే......
1. చుంబనం,
2. ఆలింగనం,
3. దంతక్షతం,
4. నఖక్షతం,
5. ప్రణయ తాడనం.

ఇందులో చుంబనమంటే ముద్దు.
ఆలింగనం అంటే కౌగిలింత.
దంతక్షతం అంటే చిన్నగా కొరకటం.
నఖక్షతం అంటే గోళ్లతో చిన్నగా రక్కటం, గిచ్చటం.
ప్రణయ తాడనం అంటే శృంగారోద్రేకంలో చిన్న చిన్న దెబ్బలు కొట్టటం.

దంతక్షతం, నఖక్షతం, ప్రణయతాడనం వంటివి సాధారణంగా పురుషులకే పరిమితమని చెబుతుంటారు. రతిక్రీడలో దాదాపు ప్రతి పురుషుడూ ఈ చుంబన పంచకాన్ని ప్రయోగించి తీరుతాడు. అయితే ఎక్కువు సేపు రతి చేయలేని వారు వీటిని ముందే చేస్తారని చెబుతారు.

కొత్తగా పరిచయమైన స్త్రీతో రతి క్రీడ సాగించేదుకు సన్నద్ధులవుతుంటే ముందుగా ఆమె ఇష్టాయిష్టాలు గ్రహించి, ఒక క్రమ పద్ధతిలో చుంబన పంచకాన్ని ప్రయోగించాలి.
తొందరపడి వీటినన్నింటిని ఒకేసారి ప్రయోగించరాదు. అలా చేసిసట్లయితే స్త్రీ బెదిరిపోతుందని, రసభంగమవుతుందని శాస్త్రకారులు హెచ్చరించారు. నిదానంగా స్త్రీని పూర్తిగా ఆయత్తురాలిని చేసిఅప్పుడు వీటిని ప్రయోగించాలని సూచించారు.

అయితే ఇక్కడ వాత్స్యాయనుడు రతి క్రీడకు సంబంధించి ఒక రహస్యాన్ని వివరించాడు. స్త్రీకి రతి ప్రారంభంలోకన్నా మధ్యకాలంలో ప్రేమానురాగాలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆ సమయంలో ముద్దులు, క్షతాలు ఎక్కువగా ప్రయోగించాలని ఆయన చెబుతున్నాడు.ఆ విధంగా ప్రయోగిస్తుంటేనే స్త్రీకి ఎక్కువ ఆనందం కలుగుతుంది. కొత్తగా పరిచయమైన స్త్రీతో తొలుత కొద్దికాలం ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించాలి. పరిచయం పెరిగి ఒకరి ఇష్టాయిష్టాలను ఒకరు గ్రహించిన తర్వాత ఎటువంటి నియమాలూ పాటించవలసిన పనిలేదని శాస్త్రకారులు వివరిస్తున్నారు.
అయితే ఇదంతా ఎందుకంటే స్త్రీకి పురుషుని ఒక విధమైన నమ్మకం, ప్రేమ పుట్టించి, తనకు పూర్తిగా అనుకూలంగా చేసుకోవడానికి, రతి క్రీడ అంటే ఆమెకు మక్కువ పెంచటానికి.
కొందరు పురుషులు స్త్రీ పట్ల ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలోనూ ప్రేమ పూర్వకంగా నూ ప్రవర్తించరు. వారు దూకుడుగా, ఉన్మాదుల వలె రతి సాగిస్తారు. దీని వల్ల స్త్రీ బెదిరిపోతుంది. పురుషునిపై ఏహ్యభావాన్ని పెంచుకుని శృంగారం పట్ల విముఖురాలైపోతుంది. కాబట్టి ఈ సమయంలో స్త్రీతో వీలైనంత సున్నితంగా వ్యవహరించాలే తప్పితే మొరటుగా ప్రవర్తించరాదు.

సున్నితంగా వ్యవహరిస్తూ, నిదానంగా , ఎక్కువసేపు రతి సాగించే వానికి స్త్రీ వశమవుతుంది. అలా సున్నితంతా ప్రవర్తిస్తేనే స్త్రీకి రతిలో ఆనందం చేకూరుతుంది. స్త్రీ శరీరతత్త్వాన్ని, అభిరుచులను గుర్తించే శృంగారం కొనసాగిచాలి.
స్తీలందరి తత్వం, అభిరుచులు ఒకే విధంగా ఉండాలని ఏమీ లేదు. ఎక్కువమందికి పైన చెప్పిన సూత్రాలు వర్తిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
శృంగారంలో చుంబనానికి ఎంత ప్రాధాన్యం ఉందో, చుంబనానికి తగిన ప్రదేశాన్ని గుర్తించి అక్కడే ముద్దాడడానికీ అంతే ప్రాధాన్యం ఉంది.
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలు ::వాత్స్యాయన కామశాస్త్రం Part 10

యువతీ యువకుల నడుమ ప్రేమ అంకురించడంలో వున్న వివిధ దశలను 8 వ భాగం చివరలో తెలుసుకున్నాం. దానిని కొనసాగిస్తూ ప్రియురాలు ప్రియుడు మద్య సాగే కౌగిలింతలు గురించి వివరంగా తెలుసుకుందాం.

స్పృష్టకం:
స్త్రీ తనకు సమీపంలో ఉన్నప్పుడు కావాలని తగిలినట్టు కనపడకుండా పురుషుడు ఆమె శరీరాన్ని తాకాలి. ఆమెకు స్పర్శ సుఖాన్ని అందించాలి. ఇలా చేయడాన్ని స్పృష్టకం అంటారు.

దీనివల్ల స్త్రీలో పురుషుని పట్ల ప్రేమ అంకురించడానికి అవకాశం ఉంది. ఈ స్పర్శ వల్ల ఇరువురి శరీరాల పులకరించి ప్రేమ మరింత పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

విద్ధకం:
ఏకాంత ప్రదేశంలో ప్రియుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు అతనిని సమీపించిన ప్రియురాలు అతనికి సాయము చేసే నెపం మీద కాని, మరే ఇతర నెపం మీద కాని తన వక్షోజాలు అతనికి తగిలేలా చేయాలి. అప్పుడు ప్రియుడు కూడా సమయోచితంగా స్పదించి ఆమెకు తగిన రీతిలో తన చేష్టల ద్వారా జవాబివ్వాలి. ఇలా చేయడాన్ని విద్ధకం అంటారు.

ఇవి ప్రేయసీ ప్రియులు కొత్తలో కాని, ఎదుటివారికి తన ప్రేమను తెలియచేసేవి కాని అయి వుంటాయని వాత్స్యాయనుడు చెప్పాడు. అంటే స్త్రీ పురుషులు అపరిచితులైనప్పుడు ఈ ఆలింగనాల ప్రేమను వృద్ధి చేయడానికి పనికివస్తాయి. ప్రేయసీ ప్రియుల మధ్య కొద్దికాలంగా ప్రేమాయణం సాగుతూ వారిరువురూ బాగా పరిచయం వున్నవారైనప్పుడు గాఢాలింగనాలు కోరుకుంటుంటారు.

అయితే అపరిచితులుగా వున్న స్త్రీ పురుషులు ప్రేయసీ ప్రియులుగా మారే క్రమంలో సాగే కౌగిలింతలు కొని వున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

స్పుటకం:
స్త్రీని ఒక గోడకు కాని స్తంభానికి ఆనించి ఆమెను కౌగిలించుకుంటే దానిని స్పుటకం అంటారు. స్పుటకాన్నే మరింత బలంగా, ఎకువ ఒత్తిడితో చేస్తే దానిని పీడితకమ్* అని అంటారు.
ప్రేయసీ ప్రియుల మధ్య పరిచయం పెరిగి పరస్పరం సంభోగంపై ఆసక్తి పెంచుకుంటున్న క్రమంలోని ఆలింగనాలు వేరేవిధంగా వుంటాయి.
ఈ కౌగిలింతలలో మొదటి రెండూ ప్రేయసి మాత్రమే ఆచరిస్తుంది. చివరి రెండింటిని ప్రేయసీ ప్రియులెవరైనా ఆచరించవచ్చు. అవేమిటంటే.....

లతావేష్టికతమ్:-
చెట్టుకు తీగలు చుట్టుకున్నట్టుగా స్త్రీ పురుషుని చుట్టివేసి, అతని ముఖాన్ని ముద్దాడాలన్న కుతూహలంతో ముఖాన్ని పైకెత్తి, ఎగబాకుతూ అతని ముఖాన్ని కిందకి వంచి, తన వక్షోజాలతో బలంగా హత్తుకుంటూ, అతని ముఖంలోకి తదేకంగా చూడడాన్ని లతావేష్టికతమ్* అని అంటారని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు.

వృక్షాదిరూఢకం:
నిలుచుని ఉన్న భంగిమలో ప్రేయసి తన కాలితో ప్రియుని కాలిని తొక్కిపెట్టి ఒక కాలితో అతని తొడ మీదుగా నడుమును చుట్టివేసి, రెండవ కాలి మీద నిలిచి ఒకచేతితో అతనిని చుట్టివేసి కౌగిలించుకోవాలి. రెండవచేతితో అతని మెడను కిందికి దించి, పైకి చెట్టు ఎక్కుతున్న రీతిలో ఎగబాకుతూ ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని వృక్షాదిరూఢకం అని అంటారు.
[​IMG] ఇవి రెండూ నిలుచుని ఉన్న భంగిమలో చేసేవి. పరుండిన భంగిమలో చేసే ఆలింగనాలు మరికొన్ని ఉన్నాయి. అవి.....
తిల తిండులకమ్*, క్షీర జలకం.

ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇంతకు ముందు వివరించిన రెండు ఆలింగనాలూ సంభోగానికి సమాయత్తం చేసేవి కాగా, ఇప్పుడు వివరింనబోయేవి సంభోగానికి ముందు ఉద్రేకంతో చేసేవి. అవేమిటో తరువాయి భాగంలో తెలుసుకుందాం.
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

ముద్దులలో పందాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 11

ముద్దులకు సంబధించి అనేక విషయాలు వాత్స్యాయనుడు వివరించారు.
వాటిలో ఒకటి ముద్దులలో పందాలు. స్త్రీ పురుషులు కేవలం మదనోద్రేకంతోనే కాకుండా ప్రేమానురాగాలు పెంపొందిన తర్వాత ఉత్సాహంతో వేసుకునే పందాలివని ఆయన తెలిపాడు.
ముద్దులలో వేసుకునే పందాలలో ముఖ్యమైనది ప్రేయసీ ప్రియులు ఒకరి పెదవిని ఒకరు గ్రహించాలనే తాపత్రయంతో పెనుగులాడడం.
ఇక్కడ మరొక అంశమేమిటంటే ఒకరు ముద్దుకోసం పాకులాడుతుంటే మరొకరు దానిని దక్కనివ్వకుండా చేయడం.ముద్దులకు సంబంధించిన ఈ పందాలను రెండు రకాలుగా వర్గీకరించాడు వాత్స్యాయనుడు. వాటిలో ఒకటి మోసపు పందెం, మోసం లేని పందెం. ప్రేయసీ ప్రియులు ఎదుటివారి పెదవిని తామే ముందుగా అందుకోవాలని పెనులాగుడూ పందెం సాగిస్తారు. ఇందులో ఎటువంటి మోసాలకూ తావులేదు కాబట్టి ఇది మోసం లేని పందెమే.
ఈ పందెంలో సాధారణంగా పురుషుడే నెగ్గుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో పురుషుడు ఓడినట్టు నటిస్తాడు.
ఓడిపోయేందుకే ప్రయత్నిస్తాడు. ఆ పందెంలో స్త్రీ ముందుగా పురుషుని పెదవిని అందుకుంటుంది. ఇక్కడ పురుషుడు కావాలని ఓడిపోతున్నాడు కనుక దీనిని మోసపు పందెం అని అంటారు.

మోసపు పందాలు ప్రణయ కలహానికి దారి తీస్తుంటాయి. ఇటువంటి పందెంలో స్త్రీ ఓడిపోయినట్టయితే పురుషునితో కయ్యానికి దిగుతుంది, నటిస్తుంది, వగలుపోతుంది, హొయలు చూపుతుంది. ఈసారైతే తనే నెగ్గుతానని పురుషుడిని రెచ్చగొట్టి తిరిగి పందేనికి దింపుతుంది.

మోసపు పందేలు స్త్రీ బాగా రక్తి గట్టించగలదు. పురుషుడు ఏమరుపాటుగా వున్నప్పుడు హఠాత్తుగా అతనిపైబడి ముద్దుల వర్షం కురిపిస్తూ అతని పెదవిని దొరకబుచ్చుకుంటుంది. అతని పెదవులను తన పెదవులతో, పళ్లతో బంధించి అతనిని తన చేతుల మధ్య కట్టి పడేయాలి. ఇది మోసపు పందెంలోని ఒక విధం..

మోసపు పందేలలో ఎక్కువసార్లు స్త్రీ నెగ్గుతుంది. కొన్ని సార్లు పురుషుడు నెగ్గవచ్చు. ఎవరు నెగ్గినా ఈ పందేనికి కొనసాగింపుగా ఎదుటి వారిని సవాలు చేస్తూ మరొక పందేనికి దారితీసే విధంగా ప్రవర్తించాలని వాత్స్యాయనుడు సూచించాడు.
ఇటువంటి పందేలే స్త్రీ పురుషులలో అనురాగాన్ని పెంపొందిస్తాయని ఆయన వివరించాడు.
యవ్వనం తొలి దశలో వున్న యువకుడు స్త్రీని ముద్దాండేందుకు ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. స్త్రీ రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు తను కూడా రెండు పెదవులూ ముడిచి స్త్రీని ముద్దాడాలి దీనిని సంపుటకం అని అంటారు.

పురుషుడు శారీరకంగా స్త్రీ కంటే బలవంతుడు కాబట్టి తన బలంతో స్త్రీని తన చేతులలోకి లాక్కుని ఆమెను వశం చేసుకుని తన పెదవులతో ఆమె పెదవులను బంధించాలి. ఆమెను గేలి చేయాలి. ఉడుకుమోత్తనంతో స్త్రీ అక్కడి నుండి వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే ఆమె యత్నాన్ని భగ్నం చేయాలి. కవ్వించాలి. బెదిరించాలి. పోట్లాడాలి. ఆమెను వివశురాలిని చేసేందుకు తిరిగి తన కౌగిలిలోకి లాక్కోవాలి.

ఇవన్నీ చేసేందుకు ఒక పరిమితి ఉంది. ఈ పందేలు స్త్రీ పురుషుల అనురాగాన్ని వృద్ధి పరచేవిగా వుండాలి. ఎక్కువసేపు రతి చేయగల వారు మాత్రమే ఇటువంటి పందేలకు దిగాలి.

మోసపు పందేలలో పురుషుడు నెగ్గితే అతడు ప్రవర్తించవలసిన పద్ధతి స్థూలంగా ఇదీ. మరి స్త్రీ నెగ్గితేనో?

మోసపుపందేలలో స్త్రీ నెగ్గితే ఆమె ఎలా ప్రవర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మోసపు పందేనికి దిగుతున్నప్పుడే స్త్రీ పురుషుడిని కొద్దిగా నమ్మించాలి. అతడినే గెలిపిస్తున్నట్టుగా ప్రవర్తించాలి. పురుషుడు ఏమరుపాటుగా ఉన్నప్పుడు, సమయమెరిగి హఠాత్తుగా అతని పెదవిని గ్రహించాలి. ముందుగా అతని పెదవులను తన పెదవులతో బంధించాలి. తర్వాత పళ్ళతో బంధించాలి. మెల్లగా అతనిని వివశుడిని చేసి పందెపు మాట మరిచిపోయే విధంగా రెచ్చగొడుతూ శృంగార క్రీడకు సన్నద్ధుడిని చేయాలి.
[​IMG]
ఆ దశలో పందెపు మాట గుర్తు వచ్చినట్టు అతని నుంచి విడివడిపోయి పందెంలో ఓడిపోయారంటూ ప్రియుడిని గేలి చేయాలి. అతని మగతనాన్ని శంకిస్తూ మాటలతో రెచ్చగొట్టాలి. ఇకెప్పుడూ ఇటువంటి పందేలు తనతో ఆడవద్దని విజయం తనదే అవుతుందని బెదిరిస్తూ, చేవవుంటే మరల పందేనికి దిగమని ఆహ్వానించాలి. క్రీగంట చూస్తూ, మనోహరంగా నవ్వుతూ, కవ్విస్తూ ప్రియుడి మనసెరిగి మాట్లాడాలి. ఇలా చేస్తే మోసపు పందేలలో ప్రేయసీ ప్రియులిరువురికీ ఎక్కువ ఆనందం కలుగుతుంది.

ముద్దులకు సంబంధించి మోసపు పందేలలో స్త్రీ పురుషులు ఈ విధంగా ప్రవర్తిస్తూ, సమయోచితంగా వ్యవహరిస్తూ ఉంటే వారిరువురి మధ్య అనురాగం పెంపొందుతుందని వాత్స్యాయనుడు వివరించారు.
[​IMG]
స్త్రీ పురుషులు ముద్దాడుకొనవలసిన తీరులనూ వాటికి వాత్స్యాయనుడు ఇచ్చిన పేర్లనూ గతంలో కొన్ని చూశాం. ఇప్పుడు మరికొన్ని చూడండి.

నూతనంగా యవ్వనంలో ప్రవేశించిన యువకుడు స్త్రీని ముద్దాడే తీరు గురించి చెబుతూ పురుషుడు రెండు పెదవులు ముడిచి, స్త్రీ కూడా రెండు పెదవులు ముడిచి ఉన్నప్పుడు ఆ పెదవులను తన నోటిలోకి తీసుకోవాలి. దీనినే సంపుటకం అని అంటారు.

పెదవులను ముద్దాడే పద్ధతులలో అంతర్ముఖ చుంబనం అని మరొక పద్ధతి కూడా ఉంది. దాని గురించి వాత్స్యాయనుడు ఏం చెబుతున్నాడో ఇప్పుడు చూద్దాం. స్త్రీ పురుషుల్లో ఎవరి పెదవులు ఎవరి నోట్లోకి ప్రవేశిస్తాయో వారు ఎదుటివారి చిగుళ్ళను తన నాలుకతో తాకాలి.

ఇలా చేస్తున్నప్పుడు స్త్రీ పురుషులిరువురూ తమ తమ నాలుకలను పొడుగ్గా సాచి లేదా, ఒకరి నాలుకలతో మరొకరి నాలుకను స్పృశిస్తూ కొనసాగే ముద్దును జిహ్వా యుద్ధం అని అంటారు. జిహ్వా యుద్ధం గురించి ముద్దులలో రకాల గురించి తెలుసుకునే ముందు వీటి గురించి వాత్స్యాయనుడు వీటి వర్గీకరణ ఎలా చేశారన్నది చూద్దాం.

వాత్స్యాయనుడు కేవలం శృంగార శాస్త్రానికి సంబంధించిన మహోద్రంథాన్ని రచించిన మహా మునే కాదు స్త్రీ పురుషుల మనసత్వాలనూ, శారీరక తత్వాలను ఏ సమయంలో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో క్షుణ్ణంగా తెలుసుకున్న మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న శాస్త్రవేత్త అని మనం తెలుసుకోవాలి.

భిన్న స్వభావాలు కలిగిన స్త్రీ పురుషులను ఎంతో సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఆయనీ గ్రంథ రచనకు పూనుకున్నారేమో అని అనిపించక మానదు. లేకుంటే ఇన్ని విషయాలు ఇంత సుబోధకంగా వివరించడం ఎవరి వల్లా కాదేమో కదూ!
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

ముద్దులలో మరికొన్ని మరియు నఖ, దంత క్షతాలు ప్రాధాన్యత :: వాత్స్యాయన కామశాస్త్రం Part 12

ఇప్పటి వరకు వాత్సాయనుడు చెప్పిన అనేక విషయాలు గురించి తెలుసుకున్నాము. గత బాగంలో శృంగారంలో ముద్దులకి ఉన్న ప్రాధాన్యత వాటితో శృంగార జీవితాన్ని ఎంత రసవత్తరంగా మార్చు కోవచ్చో తెలుసుకున్నాం.[​IMG]
ఈ బాగంలో ముద్దులలోని మరికొన్ని రకాలు తెలుసుకుందాం. ప్రియుడు ప్రియురాలిని, ప్రియురాలు ప్రియుడిని వారికి తెలియని సమయంలో ముద్దాడటాన్ని రకరకాలుగా వాత్స్యాయనుడు వర్గీకరించారు.
వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూడండి.

రాగ దీపం: రాత్రివేళ ప్రియుడు నిద్రిస్తున్న సమయంలో అతనికి తెలియకుండా ప్రియురాలు తనకిష్టం వచ్చిన రీతిలో అతడిని ముద్దాడితే దానిని రాగదీపం అని అంటారు.

చలితకం: ప్రియుడు ప్రణయ కలహంలో మునిగిన సమయంలో కాని, సంగీతం ఇతర వ్యాపకాల్లో మునిగిన సమయంలో కాని, లేదా పరాకుగా వున్న సమయంలో ప్రియురాలు అతడిని ముద్దాడితే దానిని చలితకం అంటారు.
ప్రాతిబోధకం: అర్ధరాత్రి ప్రియురాలు ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ప్రియుడు అమెను ముద్దాడితే దానిని ప్రాతిబోధకం అని అంటారు. నిద్రిస్తున్న ప్రియురాలిని నిద్ర నుంచి మేల్కొల్పడమే దీని లక్ష్యం. నిద్ర నటిస్తున్న ప్రియురాలిని ప్రియుడు ముద్దాడితే దానిని ప్రాతిబోధక చుంబనం అని అంటారు.
ఇక్కడ తేడా అల్లా ఏమిటంటే ప్రియుడిని పరీక్షిద్దామనే ఉద్దేశంతో ప్రియురాలు కపట నిద్ర నటిస్తుంటుంది. అప్పుడామెను ప్రియుడు ముద్దాడాలి. అప్పుడది ప్రాతిబోధక చుంబనమవుతుంది.

ఛాయా చుంబనం: దీపపు కాంతి వలన గోడ లేదా మరే ఇతర ప్రదేశం మీదనైనా ఏర్పడిన ప్రియురాలి నీడను, అద్దంలో ఏర్పడిన ప్రియురాలి ప్రతిబింబాన్ని ప్రియుడు ముద్దాడితే దానిని ఛాయా చుంబనం అని అంటారు.

అంగుళి చుంబనం: ఏదైనా ప్రదర్శన జరుగుతున్నప్పుడు జనం మధ్యలో కూర్చున్న ప్రియురాలిని కేవలం ఆమెకు మాత్రమే తెలిసే విధంగా, ఇతరులకు అనుమానం రాకుండా ఆమె చేతి వేళ్ళనో, కాలివేళ్ళనో ముద్దాడడాన్ని అంగుళి చుంబనం అని అంటారు.

అభియోగాలు-పాదాంగుష్ట చుంబనాదులు: కొత్తగా పరిచయమై, ప్రేమ అంకురిస్తున్న సమయంలో ప్రియురాలు ప్రియునిపై కురిపించే ముద్దులివి. పురుషుని పాదాలు కాని, కాలి వేళ్ళు కాని ఒత్తుతూ నిద్ర ముంచుకు వస్తున్నదాని వలే నటిస్తూ అతని తొడలపై వాలిపోయి మెల్లగా తొడలపై చుంబించడాన్ని ఊరు చుంబనం అని పిలిస్తారు. తొడలపై కాక కాలి వేళ్ళను ముద్దాడితే దానిని పాదాంగుష్ట చుంబనమని అంటారు.

పరిచయం కలిసి, మాటలు పెరిగిన స్త్రీపైనే అభియోగాలు ప్రయోగించవలసి ఉంటుందని వాత్స్యాయనుడు పేర్కొన్నారు
ముద్దుల గురించి, ప్రేయసీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఎటువంటి ముద్దులు ఎదుటివారి మీద ప్రయోగించవలసి ఉంటుందీ అనే విషయాలు తెలుసుకున్నారు కదా! ముద్దుల గురించిన మరికొన్ని సంగతులు సందర్భానుసారం తెలుసుకుందాం.
[​IMG]
ప్రస్తుతం రతిక్రీడలో ముఖ్యమైన చేష్టగా వాత్స్యాయనుడు పేర్కొన్న నఖ క్షతాలు, దంత క్షతాల గురించి తెలుసుకుందాం

నఖ క్షతం:
నఖ క్షతం అంటే గొటితో సున్నితంగా గిచ్చడం, దంత క్షతం అంటే రక్కడం ప్రియుడు మోహావేశంలో మోటుగా ఇవి ప్రయోగించినా ప్రేయసికి ఇవి సుఖాన్నే ఇస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు.

అయితే మరీ మోటుతనం కూడదని మాత్రం హెచ్చరిస్తాడు.నఖ దంత క్షతాలు ప్రేయసీ ప్రియుల మధ్య అనురాగాన్ని వృద్ధి చేస్తాయని ఆయన వివరిస్తాడు.
నఖ, దంత క్షతాలము ప్రయోగించడానికి స్త్రీ శరీరంలో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కూడా ఉంటాయి. వాటిని ఎప్పుడెప్పుడు?, ఎక్కడెక్కడ ప్రయోగించాలో కూడా వివరంగా చెప్పారు వాత్స్యాయనుడు.

నఖ, దంత క్షతాల్లో రెండు రకాలున్నాయి. అవి ఏమిటంటే ఏదైనా ఒక వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసేవి. అలాంటిదేమీ లేకుండా కేవలం మోహావేశంతో చేసేవి. వస్తువు రూపాన్ని అనుకరిస్తూ చేసే క్షతాలను రూపవత్తులని, నిర్దిష్ట ఆకారం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసే క్షతాలనుఅరూపవత్తులని అంటారు.

అయితే మరికొందరు ఇటువంటి వర్గీకరణ విషయంలో వాత్స్యాయనుడితో విభేదిస్తారు. వారి వాదం ఏమిటంటే శృంగారానికి దిగిన తర్వాత మోహావేశంలో పురుషులు ఉద్రేకంగా ఉంటారు. అందువల్ల వారు ఇటువంటివి సాధారణంగా పట్టించుకోరు. కాబట్టి ఇటువంటి వర్గీకరణ అవసరం లేదంటారు వారు.

సరే... వారి వాదనని అలా ఉంచితే వాత్స్యాయనుడు ఏమంటున్నాడో చూద్దాం.

మందవేగులు, మధ్యవేగులు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు. అదేవిధంగా ఎప్పుడు పడితే అప్పుడు నఖ, దంత క్షతాలు ప్రయోగించకూడదు.


అయితే ఎప్పుడు ప్రయోగించాలి? దీనికి కూడా వాత్స్యాయనుడు సంపూర్తి వివరణ ఇచ్చారు.

ప్రియురాలిని చాలాకాలం తర్వాత కలుసుకున్నప్పుడూ.
ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడానికి.
ప్రేయసిని విడిచి దేశాంతరం వెళ్ళేప్పుడు కాని.
శృంగారం క్రీడలో ప్రేయసికి మరింత ఆనందాన్ని కలిగించడానికి.
ఈ సమయాలలో నఖ, దంత క్షతాలు ప్రయోగించవచ్చట.

ముందుగా నఖ క్షతాలనే ప్రేయసిపై ప్రయోగించాలి. ఆ తర్వాతే దంత క్షతాలు ప్రయోగించాలి. దంత క్షతాలు కూడా మృదువుగానే ఉండాలి.

ఇక ఎక్కడెక్కడ నఖ క్షతాలు ప్రయోగించాలంటే...
చంకలు, స్తనాలు, కంఠ పక్క ప్రదేశాలు, పిరుదులు, తొడలు.

ఈ ప్రదేశాలలో నఖ క్షతాలు ప్రయోగించడం వల్ల స్త్రీ, పురుషులకు ఎంతో హాయిగా ఉంటుంది.
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

నఖ క్షతాలు చేయడానికి గల నియమాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 13

నఖ క్షతాలు చేయడానికి కొన్ని నియమాలుంటాయంటారు వాత్స్యాయనుడు. అవేమిటంటే
నఖక్షతాలకు కేవలం ఎడమచేతి గోళ్ళనే ఉపయోగించాలి.
ఆ గోళ్ళు మరీ పొడవుగా కాక కొద్దిగా పొడవుండి బాగా కొనదేలి ఉండాలి.
ఆరోగ్యమైన గోళ్ళు కలవారు మాత్రమే నఖ క్షతాలు ప్రయోగించాలి.
గోళ్ళలో మట్టి, మురికి చేరి ఉండరాదు. పిప్పిగోళ్ళు ఉండరాదు.
రతిలో ఎక్కువసేపు పాల్గొనే శక్తి కలవారు మాత్రమే నఖక్షతాలు ప్రయోగించాలి.
నఖ క్షతాలు చేసేవారు గోళ్ల విషయంలో పాటింవలసిన కనీస నియమాలివి.

కౌగిలింతలలోనూ ముద్దులలోనూ రకాలున్నట్టే నఖ క్షతాలలోనూ అవి చేసే తీరును అనుసరించి వాటిని రకరకాల పేర్లతో వర్ణించారు.

అచ్ఛురితకం: అయిదు వేళ్ల గోళ్లనూ మడిచి ఎటువంటి గాటు పడకుండా చెక్కిలి మీద మెల్లిగా గిచ్చితే దానిని అచ్ఛుతితకం అని అంటారు

అర్ధ చంద్రకం: కంఠానికి రెండు పక్కలా, వక్షోజాల వెనుక భాగంలో అర్ధ చంద్రాకృతిలో గాటు పడేలా క్షతం చేస్తే దానిని అర్ధ చంద్రకం అని అంటారు.

అచ్ఛురితకం ఉపయోగించే సందర్భాలు కూడా ఉంటాయి.

ప్రియురాలిని శృంగారానికి సమాయత్తం చేసే సందర్భంలో ముఖ్యంగా ప్రియురాలితో కొద్ది పరిచయం మాత్రమే ఉన్నప్పుడు, ఆమెతో సరస సల్లాపాలు సాగిస్తూ, తనపై ఆమెకు నమ్మకం, వ్యామోహం పెంచడానికి అచ్ఛురితకం చేయవచ్చంటారు వాత్స్యాయనుడు.

అచ్చురితకం వల్ల ప్రేయసికి మధురమైన భావం కలుగుతుంది. శరీరంలో పులకరింత కలిగి ప్రియినిపై అనురాగం జనిస్తుంది. అయితే కొద్దిపాటి పరిచయం ఉన్న స్త్రీలోనే ఇటువంటి లక్షణాలను ప్రస్ఫుటంగా చూడవచ్చు.

అచ్చురితకం, అర్థ చంద్రకంలను ఎదురెదురుగా ఉన్నప్పుడు చేస్తే అప్పుడు దానిని మండలం అని అంటారు. ఈ మూడు రకాల క్షతాలను స్త్రీల బొడ్డు, పిరుదులు, గజ్జల వద్ద ప్రయోగించాలి. దీనితో స్త్రీలో ఉద్రేకం కలిగి, వివశురాలై రతి క్రీడకు సన్నద్ధం అవుతుందని వాత్స్యాయనుడు చెబుతారు.
[​IMG]
మయూర పదకం: చేతి బొటన వేలి గోటితో చను మొనల వద్ద గట్టిగా గంటు పడేలా క్షతం చేస్తే దానిని మయూర పదకం అని పిలుస్తారు. ఈ నఖ క్షతానికి అయిదు వేళ్ళ గోళ్లూ చూచుకానికి చుట్టుకుని, చూచుకానికి అభిముఖంగా ఉంటాయి.

సాధారణంగా చనుమొనల వద్ద ప్రియుడు కలిగించే కొద్దిపాటి స్పర్శకు కూడా స్త్రీ అమితంగా స్పందిస్తుంది. అటువంటిది మరి ఈ రకమైన నఖ క్షతానికి స్పందించకుండా ఉంటుందా? తప్పక స్పందిస్తుంది. దీనివల్ల స్త్రీకి అమితమైన సుఖం కలుగుతుంది. మయూర పదకానికి అనుబంధంగా సాగే నఖ క్షతాలు కూడా ఉంటాయి..స్త్రీ పురుషులు తమ తమ ఇష్టాయిష్టాలను అనుసరించి, ఎదుటివారి అభిరుచులను కూడా గౌరవిస్తూ, పరస్పరానురాగంతో సాగే శృంగారం ఎప్పుడూ ఇద్దరికీ ఎనలేని ఆనందాన్నిస్తుంది. ఇటువంటి ఆనందాన్ని మరింత పెంపొందిస్తాయి ఈ నఖ క్షతాలు. ఎక్కువ సేపు రతి కేళి సాగించే వారు యథేచ్ఛగా నఖ క్షతాలు చేసుకోవచ్చు. ప్రేయసి దేహాన్ని తడుముతూ, చుంబిస్తూ అమెలో ఉద్రేకాన్ని పెంచే ప్రతీ చేష్ట చేసేప్పుడూ ఈ నఖ క్షతాలు చేయచ్చు.

మయూర పదకంకు అనుబంధంగా సాగే కొన్ని నఖ క్షతాలు ఉంటాయని అనుకున్నాం కదా! దానిలో మొదటిది శశప్లుతకం. మయూర పదకంలో వలే చేస్తూ అయిదు గోళ్లనూ ఒక్క చోటికి చేర్చి చేసే నఖ క్షతన్ని శశప్లుతకం అని అంటారు. ఇది కూడా స్థనాగ్రం మీద, అందునా చూచకం మీద నఖ క్షతం కాబట్టి దీనిని స్త్రీఎంతగానో ఇష్టపడుతుంది.
[​IMG]
స్మరణీయకం: ప్రియుడు లేదా ప్రేయసి సుదూర ప్రాంతాలకు వెడుతూ తద్వారా వారికి సూదీర్ఘ కాలం వియోగం కలుగుతుందని భావిస్తున్నప్పుడు, ఆ వియోగం ఎక్కువ కాలం ఉండకూడదని ఆకాంక్షిస్తూ ప్రియుడు ప్రేయసి తొడ మీద చేసే నఖ క్షతాలను స్మరణీయకం అని అంటారు.

తక్కువ క్షతాలు చేస్తే ఎక్కువకాలం వియోగం కలుగనున్నదని, ఎక్కువ క్షతాలు చేస్తే తక్కువ కాలం వియోగం కలగనున్నదని చిహ్నంగా భావించమంటారు. అయితే అయిదారు మించకుండానే ఈ క్షతాలు చేయాలని వాత్స్యాయనుడు వివరించారు
-----------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------

దంత క్షతాలు :: వాత్స్యాయన కామశాస్త్రం Part 14

స్త్రీల స్వభావాలలో భేదాలను అనుసరించి వివిధ రకాల జాతులకు చెందిన స్త్రీలపై ప్రయోగించదగిన వివిధ క్షతాలను వాత్స్యాయనుడు వివరించాడు.

వాటిలో రతి క్రీడపై మిక్కిలి ఆసక్తి చూపే స్త్రీ ఎక్కువగా ఉత్పల పత్రకం అనే నఖ క్షతాన్ని ఇష్ట పడుతుందని వాత్స్యాయనుడు చెబుతున్నాడు. స్త్రీ చనుమొనకు వెనుక భాగంలోనూ, కటి వద్ద గోరు కొనలతో మృదువుగా క్షతం చేయడాన్ని ఉత్పల పత్రకం అని అంటారు.

నఖ క్షతాలకు సంబంధించిన మరికొన్ని విశేషాలను సందర్భానుసారం తెలుసుకుందాం. ప్రస్తుతం రతి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య అనురాగాన్ని పెంచే దంత క్షతాల గురించి తెలుసుకుందాం.

అసలు దంత క్షతాలు ఎన్ని రకాలో ముందుగా పరిశీలిద్దాం.

నఖ క్షతాలలో ఉన్నట్టే దంత క్షతాలలో కూడా రకాలు ఉన్నాయి. అవి:

1. గూఢకం: కేవలం గాటువంటిది పడి ఎక్కువ ఎర్రగా కందిపోకుండా పంటి మొనతో క్షతం చేయడాన్ని గూఢకం అంటారు. గూఢకం ఎక్కువగా వక్షోజాలు, చెక్కిలిపై చేయచ్చు. ఈ క్షతం వల్ల స్త్రీకి బాధ కలగదు. పైపెచ్చు ఒకవిధమైన హాయి కలుగుతుంది.

2. ఉచ్చూనకం: గూఢకాన్నే మరింత గట్టిగా చేస్తే అది ఉచ్చూనకం అవుతుంది. దీనిని కూడా గూఢకం ప్రయోగించే ప్రదేశాలలోనే ప్రయోగించవచ్చు. పెదవులపై కూడా ఉచ్చూనకం చేయవచ్చు....

3. బిందువు: పై పెదవి, కంఠానికి పక్క భాగంలో చిన్న గాటు పడేలా పురుషుడు తన పై పళ్ళలోని ముందరి రెండు పళ్ళు, కింది పెదవిలోని రెండు పళ్ళూ కలిపి క్షతం చేస్తే దానిని బిందువు అని అంటారు. బిందువునే పదే పదే ప్రయోగించగా స్త్రీకి అ ప్రాంతంలో ఎర్రగా కందిపోతే దానిని బిందు సిద్ధిఅని అంటారు. బిందుసిద్ధిలో నాలుగు పళ్లూ ఒక్కసారిగా ప్రయోగించడం జరుగుతుంది.

4. బిందు మాల: .బిందు సిద్ధినే పదేపదే ప్రయోగిస్తే దానిని బిందుమాల అని అంటారు. అయితే కంఠం, కటి ప్రదేశము, నుదురు, తొడలు బిందు మాల ప్రయోగించదగ్గ ప్రదేశాలని వాత్స్యాయనుడి అభిప్రాయం.

5. ప్రవాళమణి: ప్రవాళమణి ఉచ్చూనకం వంటిదే. ప్రవాళమణిని స్త్రీ ఎడమ బుగ్గపై ప్రయోగించవలసి ఉంటుంది. ప్రవాళమణి వల్ల చిన్న గాటు పడుతుంది. ఇది స్త్రీ పురుషుల అనురాగానికి చిహ్నంగా ఎదుటివారికి గోచరిస్తుంటుంది. కాబట్టి ప్రవాళమణిని ప్రేయసి, ప్రియుల మధ్య తగదని, కేవలం వివాహ సంబంధం ఏర్పడిన వారి మధ్యనే ఇటువంటి దంతక్షతాలు చేయవచ్చని చెబుతారు. ..................................................
దీని పరమార్ధం ఒక్కటే. స్త్రీ గుట్టుగా సాగించే ప్రేమాయణాన్ని ఇది రట్టు చేస్తుంది కనుకనే వాత్స్యాయనుడు ఈ విధంగా హెచ్చరించి ఉంటాడని మనం అర్ధం చేసుకోవచ్చు. .

పై పళ్ళూ కింది పెదవి కాని, కింది పళ్ళూ పై పెదవిని ఉపయోగించి కానీ ప్రవాళమణిని చేయవచ్చు. ప్రవాళ మణిని స్త్రీకి కొద్దిగా బాధ కలిగేలా, గట్టిగా గాటు పడేలా ప్రయోగిస్తే అప్పుడు దానిని ప్రవాళమణి సిద్ధి అని అంటారు.
ఒకే ప్రదేశంలో పదేపదే ప్రయోగిస్తే అది ప్రవాళ మణి సిద్ధి, వేరు వేరు ప్రదేశాలలో ప్రయోగిస్తే అది మణిమాల అవుతాయి.

ఉచ్చునకం, బిందువు ప్రయోగించదగిన అన్ని ప్రదేశాలలో ప్రవాళమణిని ప్రయోగించవచ్చు.

స్త్రీ వక్షోజాలపై గుండ్రగా గాటు పడేలా క్షతం చేస్తే దానిని ఖండ్రాభ్రకం అని అంటారు. అయితే ఈ క్షతం వల్ల కొద్ది పళ్ళ గాట్లు స్ఫుటంగా, మరికొన్ని అస్పష్టంగా గాటు పడుతుంది. పురుషుడు ఎక్కువగా ఇష్టపడే క్షతం ఇది. దీనివల్లనే స్త్రీకి అపరిమితమైన ఆనందం కలుగుతుంది. మోహావేశం అధికమవుతుంది.

No comments:

Post a Comment