ఓబులేష్ రచనలు

ఓబులేష్  రచనలు
ఓబులేష్ రచనలు

Monday, 27 April 2015

ooooohalu

త్రివర్గ ప్రతి పత్తి
:::::::::::::::::::;:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
కాని మనుషుల విషయం అలా కాదు కాల విచక్షణ లేకుండా కావల్సినప్పుడల్లా కామ సుఖాన్ని పొందుతారు . సంతానం కొరకు బుుతు సమయంలోను , స్త్రీ ని సంతోష పెట్టడం కొరకు ఇతర సమయాల్లోను కామ సుఖాల్లో తేలియాడుతు ఉంటారు , పశువులు ధర్మార్థల కోసం , వంశాభివృద్ది కోసం సంభోగించవు , కానీ మానవులు బుద్ధి పూర్వకంగా సంతానం కోసమో కామ సౌఖ్యం కోసమే సంభోగిస్తూ ఉంటారు , ఏదో మనకు తోచినట్టు రతి క్రీడ సలపవచ్చు , కానీ ఈ శాస్త్రం చదివితే స్త్రీ లను పురుషులు , పురుషులను స్త్రీ లు , ఎక్కువగా సంతోష పెట్టగలరు. ఎందుకంటే అలా స్త్రీ పురుషులు పరస్పరం సంతోష పెట్టడానికి అవసరమైన ప్రత్యేక విషయాలు , మెలకువలు ఈ శాస్త్రం లో పొందుపరచబడి ఉన్నాయి . అంతేగాక ఈ శాస్త్రం మూలంగా ఆరోగ్యం పాడు కాకుండా ఒక క్రమ పద్దతిన కామ సుఖం పొందటానికి వీలుకుగుతుంది.
అసలు ఈ ధర్మం అవసరమా ! యజ్ఞ యాగాలు వల్లా దొరికే ఫలం మరో జన్మలో లభిస్తుంది . అందుచేత అది అలౌకికం . అప్పటికప్పుడు కాకుండా ఎప్పుడో ఫలాన్నందించే ధర్మాన్ని అనుసరించటం అవసరమా అన్నది కొందరి ప్రశ్న
మరు నిమిషం లో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియనప్పుడు , ఎంతో శ్రమ పడి బ్రహ్మ చర్యం , తపస్సు లాంటివి ఆచరిస్తే ఫలితం ఎలా ఎప్పుడు దొరుకుతుందో ఎవరూ నిర్ధారించి చెప్పలేదు. ఎప్పుడో ఏదో ఫలితం లభిస్తుందని ఈ లోకంలో అందుబాటులో ఉన్న సుఖాన్ని వదులు కోవడం తెలివైన వ పని కాదు. రేపు దొరికే నెమలి కోసం ఎదురు చూడడం కన్నా ఈ రోజు దొరికిన పావురంతో తృప్తి పడడం మేలు . అంటే రేపు దొరికే పరలోక సౌఖ్యం కంటే ఇవాల్టి ఇహలోక సౌఖ్యం మేలైనది .
సూ: వరం సాంశయికాన్ని ష్కాద సాంశయికః కార్షాపణ ఇతి లౌకాయతికాః
పైన చెప్పిన దానికి ఉదాహరణ.
ఒకయాన యాచనం కోసం వస్తే ఈ రోజు నా వద్ద ఒక్క రుపాయ మాత్రమే ఉంది రేపు నాకు వెయ్యి రుపాయలు రావల్సి ఉంది . రేపు వస్తే అందులోంచి నీకు కొంత ఇస్తాను అన్నట్లు , అప్పుడు యాచకుడు రేపు నీకు డబ్బు వస్తోందో రాదో ఎవరికీ తెలుసు . నాకు ఆ ఒక్క రుపాయ ఇయ్యి అని తీసుకున్నాడట. అలౌకిక ధర్మాన్ని ఆచరించని వారి వాదం ఇది.
పై వాదాన్ని ఖండిస్తూ , ధర్మం యోక్క అవశ్యకతను నొక్కి వక్కానిస్తు వాత్యాయనుడు ఈ క్రింది విధంగా అంటాడు .
శాస్త్ర న్ని ఎప్పుడు మంచి దృష్టితో చూడాలి కాని శంకించడం తగదు చేతబడులు లాంటి దుష్ట కర్మ లకు , శాంతి వంటి సత్కర్మలకు వాటి వాటి ఫలితాలు కనిపిస్తూనే ఉంటాయి . సూర్య చంద్రులు ఇతర గ్రహలు ఈ భూగోళం ఇవన్ని ఏమి ఆశించి తమ పని తాము చేస్తున్నాయి . అందుచేత ధర్మం ఎందుకని ఆలోచించకుండా వర్ణశ్రమ ధర్మాలను ఆచార వ్యవహారాలను లోక యాత్రను పాటించాలి. ఎప్పుడో చేతికందే పంటకోసం మన చేతిలో ఉన్న విత్తనాలను జల్లినట్లె , మున్ముందు సత్ఫలితాలు పొందటం కోసం ఇప్పుడు ధర్మాన్ని ఆచరించి తీరాలి






No comments:

Post a Comment